- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు స్థాపన ఆలోచన మాజీ ప్రధాని మన్మోహన్ దే: కాంగ్రెస్ సీనియర్ జైరాంరమేశ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న 17వ BRICS సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న 17వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొంటుండగా.. కాంగ్రెస్ పార్టీ బ్రిక్స్ ఏర్పాటుకు దారితీసిన చరిత్ర, 2012లో భారత్ ఆతిథ్యమిచ్చిన సమ్మిట్‌ను గుర్తు చేసింది. అప్పట్లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ స్థాపనను ప్రతిపాదించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. శనివారం బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ ఈ పర్యటనలోని నాలుగో దశను పూర్తి చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనాలను సందర్శించగా తర్వాతి నమీబియాకు వెళ్లనున్నారు.
షాంఘైలో న్యూ డెవలప్ మెంట్ ఏర్పాటు
జైరాం రమేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1998లో రష్యా ప్రధాని యెవ్‌గెనీ ప్రిమాకోవ్ (RIC) (రష్యా, ఇండియా, చైనా) అనే త్రైపాక్షిక వేదికను ప్రతిపాదించారు. 2001లో గోల్డ్మాన్ శాక్స్ నివేదిక (BRIC) దేశాలను భవిష్యత్తు ఆర్థిక శక్తులుగా గుర్తించింది. 2006లో జీ8 సదస్సు సందర్భంగా నేతల అనుమతితో (BRIC) రూపుదిద్దుకుంది. 2009లో మొదటి BRIC సమ్మిట్ రష్యాలో జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఇది BRICSగా మారింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా, ఈ ఏడాది ఇండోనేషియా కూడా సభ్యత్వం పొందింది. 2012లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన అభివృద్ధి బ్యాంక్ 2015లో షాంఘైలో ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’గా ప్రారంభమైంది. భారత బ్యాంకర్ కె.వి. కామత్ దీనికి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ బ్యాంక్ నుంచి భారత్ ఇప్పటివరకు నగర రవాణా, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధనం తదితర మౌలిక సదుపాయాల కోసం దాదాపు 8 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందినట్లు జైరాం రమేశ్ వెల్లడించారు.






