- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఆకాశంలో ఊడిన ఫ్లైట్ డోర్.. అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆకాశంలో ఊడిన ఫ్లైట్ డోర్.. అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానం గాలిలో ఉండగానే డోర్ ఊడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విమానం గాలిలో ఉండగానే డోర్ ఊడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 174 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇవాళ అమెరికాలోని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అయితే, విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన వెంటనే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ ఊడి పడింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్ సురక్షితంగా ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్లు అలస్కా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Next Story






