5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి !

by velandi.Saikiran |

5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసింది. సౌదీ అరేబియాలోనే ఇరాన్ ఈ దాడికి పాల్ప‌డింది. దీంతో 5 విమానాలు ధ్వంసమయ్యాయి.

5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి !
X

దిశ, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. దాదాపు 14 రోజులుగా ఈ వారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది మరణించగా, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా తగ్గడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. ఐదు అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఐదు అమెరికా విమానాలపై ఇరాన్ ఎటాక్

అమెరికాకు చెందిన వైమానిక దళం ఇంధనం నింపే ఐదు విమానాలను ఇరాన్ ధ్వంసం చేసిందని సమాచారం. తన మిస్సైల్స్ తో దాడి చేసి, ఈ విమానాలను ధ్వంసం చేసినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న ఈ విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లు వెల్లడించింది వాల్ స్ట్రీట్ జనరల్. అయితే అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది.

ఇక ఈ దాడిలో ఎవరు కూడా మరణించలేదని క్లారిటీ ఇచ్చింది వాల్ స్ట్రీట్ జనరల్. ఇది ఇలా ఉండగా నిన్న ఇరాక్ లో కూలిన అమెరికా KC-135లోని ఆరుగురు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు మిడిలిస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్ లోని ఖర్గ్ ద్వీపంపై వేసినట్లు అటు ట్రంప్ వెల్లడించారు. అందులో మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఆయిల్ ఇన్ స్ట్రక్చర్ ను టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.


Next Story