- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో కుటుంబం సూసైడ్.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్ లో అప్పుల బాధతో ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది. భర్త, భార్యతో పాటు కుమార్తె కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో అప్పుల బాధతో ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది. భర్త, భార్యతో పాటు కుమార్తె కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. వ్యాపారంలో నష్టాలు రావడం, బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్నోలోని అష్రఫాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ విశ్విజిత్ శ్రీ వాస్తవ తెలిపారు. మృతులను శోబిత్ రస్తోగి (48), అతని భార్య సుచిత రస్తోగి (44), కుమార్తె ఖ్యాతి రస్తోగి (16) గా గుర్తించారు.
బాధితుడు వస్త్ర వ్యాపారం చేయగా నష్టాలు..
సోమవారం ఉదయం తల్కటోరా ప్రాంతంలోని ఒక వస్త్ర వ్యాపారి తన కుటుంబంతో కలిసి విషం తాాగాడని పోలీసులకు సమాచారం అందిందని డీసీపీ శ్రీవాస్తవ నేషనల్ మీడియాకు తెలిపారు. విషం తాగిన వారిలో మైనర్ కుమార్తె ఈ సంఘటన గురించి తన మామకు ఫోన్ లో తెలియజేసింది. కానీ అతను అక్కడికి చేరుకునే సమయానికి వారి పరిస్థితి పూర్తి విషమంగా మారిపోయింది. ముగ్గురిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ట్రామా కేర్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి వారు మరణించినట్లు చెప్పినట్లు కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు. నిందితుడి నివాసం నుంచి విషానికి సంబంధించిన బాటిల్ దొరికిందని బాధితుడు బ్యాంకు రుణం కారణంగా ఇబ్బంది పడుతూ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నివాసం నుండి సల్ఫా బాటిల్ ను స్వాధీనం చేసుకున్నామని, బాధితుడు బ్యాంకు రుణం కారణంగా ఇబ్బంది పడుతున్నాడని ఆయన అన్నారు. ఇటీవలే రాజస్థాన్ కు చెందిన వ్యాపారి కారులోనే తన ఫ్యామిలీకి విషమిచ్చి తాను తాగి మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మరువక ముందే అప్పుల బాధతో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది.






