- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలాక్-ఎ-హసన్ అంటే ఏంటి? ట్రిపుల్ తలాక్ తరవాత సుప్రీం ముందు పరిశీలనలో మరో ముస్లిం చట్టం!
ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన ఎనిమది సంవత్సాల తరవాత మరో ముస్లిం విడాకుల ఆచారం తలాక్ ఎ హసన్‌పై సుప్రీం దృష్టి పెట్టింది. ఘజియాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ బెనజీర్ హీనా 2022లో తలాక్-ఎ-హసన్ ఆచారం వివక్షత చూపే విధంగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

దిశ, వెబ్ డెస్క్: ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన ఎనిమది సంవత్సాల తరవాత మరో ముస్లిం విడాకుల ఆచారం తలాక్ ఎ హసన్‌పై సుప్రీం దృష్టి పెట్టింది. ఘజియాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ బెనజీర్ హీనా 2022లో తలాక్-ఎ-హసన్ ఆచారం వివక్షత చూపే విధంగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పురుషులు మాత్రమే ఈ ఆచారాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం 9 పిటిషన్లు దాకలు కాగా సూర్యంకాంత్ మరియు జోయ్ మల్య బాగ్చిల ధర్మాసనం పరీశిలిస్తోంది. తలాక్ ఎ హసన్ ఆచారం కూడా ట్రిపుల్ తలాక్ లాంటిదే. అయితే ట్రిపుల్ తలాక్‌లో వెంటనే విడాకులు మంజూరైతే తలాక్ ఎ హసన్ విడాకుల ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది.
ఇది మహమ్మద్ ప్రవక్త ఆమెదించిన విడాకుల పద్ధతి అని చెప్పుకుంటారు. ఇది ఇద్దరు భార్య భర్యల మధ్య సయోధ్యకు సైతం సమయం ఇస్తుంది. తలాక్ ఎ హసన్ ఆచారంలో భర్త నెలకు ఒకసారి తలాక్ అని అంటాడు. ముఖ్యంగా భార్యకు పీరియడ్స్ ప్రారంభం అవ్వనప్పుడు తలాక్ పలికితే మళ్లీ ఆమెకు పీరియడ్స్ ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాలి. ఈ సమయంలో ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే, రెండవసారి పీరియడ్ సమయంలో తలాక్ చెప్పాలి, ఆ తరవాత మూడోసారి రాజీపడకపోతే మళ్లీ పీరియడ్స్ సమయంలో తలాక్ చెప్పాలి. మూడు సార్లు చెబితే మళ్లీ అవకాశం లేకుండా విడాకులు తీసుకోవాల్సిందే.
ఇక ముస్లిం చట్టం ప్రకారం తలాక్ ఎ హసన్ పురుషుడు మాత్రమే చెప్పాలి. ఒకవేళ ముస్లిం మహిళ ఏకపక్షంగా విడాకులు తీసుకోవాలి అంటే వారికి ఉన్న ఏకైక అవకాశం ఖులా. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ హైకోర్టు ఓ ముస్లిం జంట కేసులో భార్య ఏకపక్షంగా ఖులా ద్వారా విడాకులు తీసుకుకోవడాన్ని సమర్ధించింది. మహిళ ఏకపక్షంగా విడాకులు తీసుకునే హక్కును పునరుద్ఘాటించింది. ఖులా ద్వారా స్త్రీ తన భర్త సమ్మతి లేకుండానే విడాకులు తీస్కోవచ్చని స్పష్టం చేసింది. దీంతో తలాక్ ఎ హసన్ విషయంలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.






