'గతంలో నేను జాతి వివక్ష ఎదుర్కొన్నా'.. బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

by Hajipasha |
గతంలో నేను జాతి వివక్ష ఎదుర్కొన్నా.. బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

లండన్: భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంచలన విషయాలను వెల్లడించారు. తన జీవితంలో కూడా జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయల్ ప్యాలెస్‌లో వివాదంపై స్పందించడం సరైంది కాదని అన్నారు. అయితే వారు ఏమి జరిగిందో అంగీకరించి, దానికి క్షమాపణ చెప్పారన్నారు. 'గతంలో నేను కూడా జాతి వివక్షను నా జీవితంలో ఎదుర్కొన్నాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు అనుభవించిన కొన్ని విషయాలు ఇప్పటికీ జరగుతున్నాయంటే నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మన దేశం జాత్యహంకారాన్ని ఎదుర్కోవడంలో అద్భుతమైన పురోగతి సాధించింది' అని పేర్కొన్నారు.

అంతకు ముందు బంకింగ్‌హం ప్యాలెస్‌లో ప్రిన్స్ విలియమ్స్ గాడ్‌మదర్ సుసాన్ హుస్సే బ్రిటిష్ చారిటీ వర్కర్ పులానిని పదే పదే ఎక్కడి నుంచి వచ్చావ్, ఏ దేశానికి చెందిన వారని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఈ చర్యలు పులానిని బాధించినట్లు తెలిపింది. ఇది కాస్త వివాదంగా మారి జాతి వివక్ష అంటూ విమర్శలు రేగాయి. దీంతో సుసాన్ తన బాధ్యతల నుంచి తప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు.

Next Story