పావో నుర్మి గేమ్స్‌లో నీరజ్‌కు స్వర్ణం

by Harish |
పావో నుర్మి గేమ్స్‌లో నీరజ్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సత్తాచాటాడు. ఫిన్లాండ్‌లో మంగళవారం జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో విజేతగా నిలిచాడు. 8 మంది పాల్గొన్న అథ్లెట్లలో నీరజ్ మూడో ప్రయత్నంలో 85.97 మీటర్ల త్రోతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 2022లో ఇదే టోర్నీలో నీరజ్ 89.30 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్లాండ్‌కు చెందిన టోనీ కెరనెన్(84.19 మీటర్లు), ఓలివర్ హెలాండర్(83.96 మీటర్లు) రజతం, కాంస్యం సాధించారు.Next Story

Most Viewed