ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం.. వాసుదేవరెడ్డి ఫైర్

by Satheesh |
ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం.. వాసుదేవరెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏదీ పడితే అది మాట్లాడితే ఊరుకోం.. నిరుద్యోగుల పక్షాన మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి తప్ప పిచ్చిగా మాట్లాడి పెద్ద వాళ్ళను విమర్శిస్తే పెద్ద వాళ్ళు కారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవా రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి 6 నెల‌లు దాటిందని, ఈ ఆరు నెల‌ల వ్యవ‌ధిలో నిరుద్యోగుల‌కు ఒక్క కొత్త నోటిఫికేష‌న్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బ‌ల్మూర్‌ వెంక‌ట్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటు పోయిందని, జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అసెంబ్లీ ఎన్నికల్లో నిరుగ్యోగులను రెచ్చగొట్టి వారి కోసం మ్యానిఫెస్టో పెట్టి ఈ రోజు ఆ అంశాల‌పై మాట్లడరెందుకు? అని నిలదీశారు. బల్మూర్ వెంకట్‌తో చర్చకు హరీష్ రావు కాదు నేను వస్తా.. నిరుద్యోగుల డిమాండ్లపై చర్చిద్దాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగులు ఇచ్చారో చర్చకు సిద్ధమా..? అని స‌వాల్ చేశారు. గ్రూప్స్ ఉద్యోగాల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. వారిని కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు బెదిరిస్తున్నట్లు నిరుద్యోగులు వాపోతున్నారన్నారు. నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి బల్మూరిది కాదని, ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.Next Story

Most Viewed