అదరగొట్టిన అర్జున్..స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టైటిల్ కైవసం

by Harish |
అదరగొట్టిన అర్జున్..స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : తెలుగు కుర్రాడు, భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అర్మేనియాలో జరుగుతున్న చెస్ టోర్నీని మరో రౌండ్ మిగిలి ఉండగానే దక్కించుకున్నాడు. 8వ రౌండ్‌లో వోలోడార్ ముర్జిన్(రష్యా)పై నెగ్గడంతో టోర్నీలో అతని విజయం లాంఛనమైంది. మంగళవారం జరిగిన నామమాత్రపు 9వ రౌండ్‌లో అర్మేనియా ప్లేయర్ పెట్రోస్యాన్‌తో అర్జున్ పోటీపడ్డాడు. నల్లపావులతో ఆడిన అతను 43 ఎత్తుల్లో డ్రాకు అంగీకరించాడు. టోర్నీలో అర్జున్ 9 రౌండ్లలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. నాలుగు విజయాలు, ఐదు డ్రాలతో 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకపోయాడు. ఈ ప్రదర్శనతో అర్జున్ ఫిడే లైవ్ రేటింగ్స్‌లో 2779.9 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకున్నాడు. అతని కంటే ముందు మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే, 2831.8), హికారు నకమురా(అమెరికా, 2801.6), ఫాబియానో కరువానా(అమెరికా, 2795.6) ఉన్నారు. ఫాబియానో కరువానా కంటే అర్జున్ కేవలం 16 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ ఏడాది అర్జున్‌కు ఇదే రెండో టైటిల్. ఏప్రిల్‌లో అతను మెనోర్కా ఓపెన్ విజేతగా నిలిచాడు.Next Story

Most Viewed