చైనాకు మోడీ భయపడరు..డ్రాగన్‌కు తైవాన్ కౌంటర్

by vinod kumar |
చైనాకు మోడీ భయపడరు..డ్రాగన్‌కు తైవాన్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీకి తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే అభినందనలు తెలిపారు. అయితే దీనిపై చైనా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో తైవాన్ డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చింది. తైవాన్ ఉప విదేశాంగ మంత్రి టియన్ చుంగ్-క్వాంగ్ ఓ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ..మోడీకి గానీ, తైవాన్ అధ్యక్షుడికి గానీ చైనా అంటే భయం లేదని భావిస్తున్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన స్నేహ పూర్వక చర్చలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఒకరి నొకరు అభినందించుకోవడం సాధారణ విషయమని, ఇందులో చైనా ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కావడం లేదన్నారు. అన్ని దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని తెలిపారు.

మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే మోడీకి అభినందనలు తెలిపారు. ఇండో పసిఫిక్‌లో శాంతి నెలకొనేందుకు అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్-తైవాన్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం మోడీ లైచింగ్‌కు రిప్లయ్ ఇచ్చారు. ‘తైవాన్‌తో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడానికి భారత్ సైతం సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌కు దూరంగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ భారత్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తైవాన్ తాజాగా కౌంటర్ ఇచ్చింది.Next Story

Most Viewed