ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

by Ajay Maddhiboyina |

ప్ర‌ధాని మోడీకి ఇథియోపియా అత్యున్న‌త పుర‌స్కారం ద‌క్కింది. ఇథియోపియా దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ది గ్రేట్ హాన‌ర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను మోడీ అందుకున్నారు.

ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీకి ఇథియోపియా అత్యున్న‌త పుర‌స్కారం ద‌క్కింది. ఇథియోపియా దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ది గ్రేట్ హాన‌ర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను మోడీ అందుకున్నారు. అంతేకాకుండా పుర‌స్కారం అందుకోవ‌డంతో ప్ర‌పంచంలోనే ఈ గౌర‌వం అందుకున్న తొలి ప్ర‌పంచ దేశాధినేత‌గా మోడీ నిలిచారు. ఇక ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తుతం ఇథియోపియాలో పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఆయ‌న ఇథియోపియా రాజ‌ధాని అడిస్ అబాబాలో అడుగుపెట్టారు.

విమానాశ్ర‌యంలో ఆ దేశ ప్ర‌ధాని అబియ్ అహ్మ‌ద్ అలీ స్వ‌యంగా ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికారు. అధికారిక ప్రోటోకాల్ ప‌క్క‌న పెట్టి ప్ర‌ధాని త‌న కారులోనే మోడీని హోట‌ల్ కు తీసుకువెళ్లారు. మార్గ‌మ‌ధ్య‌లో ఓ సైన్స్ మ్యూజియంను, ఫ్రెండ్ షిప్ పార్కుల‌ను మోడీకి చూపించారు. మ‌రోవైపు ఇథియోపియా చేరుకున్న వెంట‌నే మోడీ త‌న ఎక్స్ ఖాతాలో వివిధ రంగాల్లో భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి ఇథియోపియా నాయ‌కత్వంతో చ‌ర్చించ‌డానికి ఎదురుచూస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story