- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చారిత్రాత్మక నిర్ణయం.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే అత్యవసర గర్భనిరోధక మాత్రల అమ్మకానికి ఆమోదం
ఆస్కా ఫార్మాస్యూటికల్ అనే సంస్థ తయారు చేస్తోన్న నార్లెవో అనే పిల్ అమ్మకాలకు జపాన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: అత్యవసర గర్భనిరోధక మాత్రలు కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావలసి ఉంటుంది. అన్ వాంటెడ్ సెక్స్ జరిగిన 72 గంటల్లోగా ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే 80 శాతం వరకూ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందని డాక్టర్లు చెప్తారు. అయితే తాజాగా జపాన్ ప్రభుత్వం ఈ గర్భనిరోధక మాత్రల అమ్మకం విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నేరుగా ఎమర్జెన్సీ గర్భనిరోధక ట్యాబ్లెట్లను ఫార్మసీల్లో విక్రయించేందుకు అనుమతినిచ్చింది.
ఆస్కా ఫార్మాస్యూటికల్ అనే సంస్థ తయారు చేస్తోన్న నార్లెవో అనే పిల్ అమ్మకాలకు జపాన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ పిల్ కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్, తల్లిదండ్రుల అనుమతి, వయోపరిమితి వంటి నిబంధనలేవీ లేవని అక్కడి మీడియా స్పష్టం చేసింది. సురక్షితం కానీ లైంగిక చర్య జరిగిన 72 గంటల్లోగా ఈ పిల్ తీసుకోవలసి ఉంటుంది. ఇది గర్భంలో అండం అభివృద్ధి చెందకుండా లేదా.. గర్భాశయానికి అండం అంటుకోకుండా నిరోధిస్తుంది. కానీ.. ఈ మాత్రను కొనుగోలు చేసిన మహిళలు.. ఫార్మసిస్ట్ సమక్షంలోనే దానిని వేసుకోవలసి ఉంటుంది. ఇది మార్కెట్లోకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు.
ప్రపంచంలో 90కి పైగా దేశాల్లో గర్భనిరోధక మాత్రలు ప్రిస్క్రిప్షన్ లేకుండా లభిస్తున్నా.. జపాన్ లో మాత్రం ఈ అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 2017లో దీనిపై ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్యానెల్ ముందుకు ఈ ప్రతిపాదన రాగా.. దానిని ఆమోదిస్తే.. పిల్ వినియోగంపై బాధ్యతారాహిత్యం పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల పునరుత్పత్తి ఆరోగ్య హక్కులపై సంఘాలు చేస్తున్న పోరాటాలు, యువతులు, అత్యాచార బాధితులు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గతేడాది 145 ఫార్మసీల్లో ప్రయోగాత్మకంగా గర్భనిరోధక మాత్రల అమ్మకానికి అనుమతించింది. అది సక్సెస్ కావడంతో.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో విక్రయాల కోసం ఆస్కా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






