వెనిజులాకు ఉచిత స్టార్‌లింక్ సేవలను ప్రకటించిన ఎలోన్ మస్క్

by Ajay Maddhiboyina |

వెనిజులాలో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో సంక్షోభం నేప‌థ్యంలో నెల‌రోజుల పాటు స్టార్ లింక్ ద్వారా ఉచిత బ్రాడ్ బాండ్ సేవ‌లు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

వెనిజులాకు ఉచిత స్టార్‌లింక్ సేవలను ప్రకటించిన ఎలోన్ మస్క్
X

దిశ‌, వెబ్ డెస్క్: వెనిజులాలో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో సంక్షోభం నేప‌థ్యంలో నెల‌రోజుల పాటు స్టార్ లింక్ ద్వారా ఉచిత బ్రాడ్ బాండ్ సేవ‌లు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని మ‌స్క్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. వెనిజులా ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. శాటిలైట్ స‌మూహం ద్వారా ప‌నిచేసే స్టార్ లింక్ నెట్ వ‌ర్క్ రాజ‌కీయ‌, భ‌ద్ర‌తా అనిశ్చితి కాలంలో ఇంటర్నెంట్ సేవ‌లు అందించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు ప్ర‌జ‌లకు ఉచిత ఇంట‌ర్నెట్ సేవలు అందుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై జ‌రిపిన సైనిక చ‌ర్య‌ను సైతం మ‌స్క్ స్వాగ‌తించాడు. నికోల‌స్ మ‌దురో అధికారంలో లేని స‌మ‌యంలో వెనిజులా అభివృద్ధి వైపు పయ‌నించ‌గ‌ల‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇదిలా ఉంటే మ‌స్క్ మ‌దురోకు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం ఇది మొద‌టిసారి కాదు.. గ‌తంలోనూ ఆయ‌న మ‌దురో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు.

Next Story