చిన్న పట్టణాలు, గ్రామాల డెవలప్ మెంట్ తోనే భారత్ లో ఆర్థికాభివృద్ధి

by Shamantha N |

భారత దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో నే కాకుండా దేశంలోని చిన్న పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సమానంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని అదానీ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ అన్నారు.

చిన్న పట్టణాలు, గ్రామాల డెవలప్ మెంట్ తోనే భారత్ లో ఆర్థికాభివృద్ధి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో నే కాకుండా దేశంలోని చిన్న పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సమానంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని అదానీ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ అన్నారు. చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ తొలి స్థాపన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాంచీ, రాయ్‌పూర్, భువనేశ్వర్ ఈశాన్య భారత్ లోని ఇతర పట్టణాల్లో నిజమైన ఆర్థికాభివృద్ధి జరిగితేనే దేశం ఫైనాన్షియల్ గా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశానికి 1.4 బిలియన్ ప్రజలే అత్యంత గొప్ప సంపదగా అభివర్ణించారు. ప్రస్తుతం భారత్ చాలా మంచి స్థితిలో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలో సుమారు 50 శాతం ప్రజలు (GDP) జీడీపీ వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నారు. మిగిలిన 50 శాతం మాత్రం నిష్క్రియంగా ఉన్నారు. వారిని ఇందులో భాగం చేయాలన్నారు. అప్పుడు నిజమైన అభివృద్ధి సాధించిన భారత్ కనిపిస్తుందన్నారు.

మూడు ముఖ్యమైన అంశాల్లో రీసెర్చ్

చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ మూడు ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు, వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలు అని తెలిపారు. ఈ ఫౌండేషన్, భారత్ అభివృద్ధి లక్ష్యాలకి అనుగుణంగా పనిచేసే వ్యూహత్మక వేదికలు అన్నారు. కేవలం మెట్రో నగరాలపై మాత్రమే ఆధారపడకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల సామర్థ్యాన్ని వెలికి తీయడంపై భారతదేశ దీర్ఘకాలిక వృద్ధి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. నిజమైన భారత్ ఇక్కడే జీవిస్తోందని ప్రణవ్ అదానీ అన్నారు. మనం ఇలాంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి. అప్పుడే భారత్ వృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు.

Next Story