- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌ను వణికిస్తోన్న భూకంపాలు.. 2 వారాల్లో 900 సార్లు..!
జపాన్‌ను గత రెండు వారాలుగా వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌ను (Japan) గత రెండు వారాలుగా వరుస భూ ప్రకంపనలు (Earthquakes) వణికిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ జపాన్‌లోని టొకారా దీవుల (Tokara Islands) సమీప ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. జూన్ 21 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో దాదాపు 900 సార్లు భూమి కంపించింది. కొన్నిసార్లు ఇవి తేలికపాటి ప్రకంపనలుగా ఉన్నా, కొన్ని భూకంపాలు తీవ్రంగా ఉండటంతో ప్రజల్లో తీవ్రంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం కూడా ఇక్కడ 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రభుత్వం, స్థానిక విపత్తు నిర్వహణ విభాగాలు ఈ ఘటనలను నిరంతరం పరిశీలిస్తున్నాయని పేర్కొన్నాయి.
ఈ వరుస భూకంపాల కారణంగా టొకారా ఐలాండ్ చుట్టుపక్కల నివసించే ప్రజలు రాత్రిపూట మేలుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనాలు కదలడం, గోడల రేఖలు, చిన్నపాటి పగుళ్లు రావడం వంటి దృశ్యాలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. అంతేకాకుండా, కొందరు తమ ఇళ్లను తాత్కాలికంగా వదిలేసి బంధువుల ఇళ్లకు లేదా సమీప భద్రత గల ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. స్థానిక స్కూళ్లు, కొన్ని కార్యాలయాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. అయితే, మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే టొకార దీవుల్లో జనావాసాలు తక్కువగా ఉండటం ఒక్కటే కొంచెం ఊరటనిచ్చే అంశం. ఇక్కడివారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడ జూన్ 23న అత్యధికంగా ఒక్క రోజులో 183 సార్లు భూమి కంపించింది. తమకు ఎప్పుడూ భూమి కదిలిస్తున్నట్లే అనిపిస్తోందని ఓ బాధితుడు స్థానిక మీడియాకు వెల్లడించాడు.
కాగా,ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే ప్రదేశాల్లో జపాన్ కూడా ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రదేశంలోని ప్రధాన భూ ఫలకాలపై ఈ దేశం ఉంది. ఇక్కడ ఏడాదికి 1500 వరకు ప్రకంపనలు నమోదు అవుతుంటాయి. గతేడాది ఇదే దీవుల్లో 346 సార్లు భూమి కంపించింది. మొత్తం 12 దీవులు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో ఏడుచోట్లే ప్రజలు నివశిస్తున్నారు. వీరి కూడా మొత్తం సుమారు 700 మంది ఉంటారు.
అధికారులు ఈ ప్రకంపనల శ్రేణిని తీవ్రంగా పరిగణిస్తూ పరిణామాలను గమనిస్తున్నారు. భారీ భూకంపాలు సంభవించవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు తక్షణ సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ సర్వీసులు ఏర్పాటు చేశారు.






