- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లవారుజామున వణికించిన భూకంపం.. ఎక్కడంటే?
by Yella Dhawani Reddy |
చైనాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్: చైనాలో (China) శుక్రవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భూకంప ప్రకంపనాలు రావటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. కాగా, చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాగే, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించినట్లు సమాచారం. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది.
Next Story






