- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Firing : అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురు మృతి
అమెరికా(America)లో మరోసారి కాల్పుల మోత మోగింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని షికాగో(Chicago)లో ఫైరింగ్ మోతలు, బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. షికాగోలోని ఓ నైట్ క్లబ్ వెలుపల ఓ దుండగుడు (Night Club Firing)పాల్పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన షికాగో నగరంలోని 311 వెస్ట్ చికాగో అవెన్యూలో స్థానిక రాపర్ మెల్లో బక్స్ ఆల్బమ్ విడుదల వేడుక అనంతరం జనం బయటకు వస్తుండగా రాత్రి 1:45 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగింది.
షికాగో పోలీసు విభాగం ప్రకారం.. దుండగులు అనేక వాహనాల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు జరుగుతోందని అన్నారు. గతంలో కూడా ఈ నైట్ క్లబ్ వద్ద కాల్పులు జరగగా.. అధికారులు క్లబ్ ను మూసివేశారని, ఇటీవలే తిరిగి ఆర్టిస్ లాంజ్‌గా తిరిగి ఓపెన్ చేశారని సమాచారం.






