వరకట్న వేధింపుల కేసు.. అత్తింటి ఎదుటే టీ స్టాల్ పెట్టి నిరసన

by Shamantha N |   (  Updated:2025-06-14 15:52:12  IST  )

రాజస్థాన్ లో వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య ఇంటి ఎదుటే భర్త టీ స్టాల్ పెట్టి మరీ నిరసన తెలుపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

వరకట్న వేధింపుల కేసు.. అత్తింటి ఎదుటే టీ స్టాల్ పెట్టి నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ లో వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య ఇంటి ఎదుటే భర్త టీ స్టాల్ పెట్టి మరీ నిరసన తెలుపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన కృష్ణ కుమార్ దకాడ్ అంతా పట్టణంలోని తన అత్తమామాల ఇంటి ఎదుట టీస్టాల్ పెట్టాడు. దానికి ‘498A T CAF’ అని పేరు పెట్టాడు. అతడి భార్య తనపై పెట్టిన కేసు నెంబర్ నే టీ స్టాల్ కు పేరు పెట్టడం గమనార్హం. దకాడ్ చేతికి సంకెళ్లు వేసుకుని హోటల్ కు టీ తాగేందుకు వచ్చిన వారికి టీ అందిస్తున్నాడు. అతని టీ స్టాల్ చుట్టూ ఉన్న బ్యానర్లలో, పోస్టర్లలో ‘జబ్ తక్ నహీ మిల్తా న్యాయ్, తబ్ తక్ ఉబల్తి రహేగీ చాయ్’ (నాకు న్యాయం జరిగే వరకు టీ మరుగుతూనే ఉంటుంది) ధాకడ్ 2018లో మీనాక్షి మాళవ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించారు. మహిళా సాధికారతకు చిహ్నంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2021లో వీరు స్థాపించిన సంస్థను కూడా ప్రారంభించారు. అయితే కృష్ణ కుమార్ భార్య 2022 లో ఏ మాత్రం చెప్పకుండా ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది.

నా తల్లి కోసం బతుకుతున్నా..

‘ఒక తప్పుడు కేసు కారణంగా అంతా నాశనమైంది. మూడు సంవత్సరాలుగా, నేను అంతాలో న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నాపై ఆధారపడి ఉన్న వృద్ధ తల్లి ఉంది. చాలా సార్లు నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను. కానీ నా తల్లి కోసం బతుకుతున్నాను’ అని కృష్ణ ఓ జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మీనాక్షి మాళవ్ మాత్రం అతను భూమి కొనడానికి నా తండ్రి నుంచి డబ్బు అడిగాడు. మేము నిరాకరించడంతో అతను నన్ను కొట్టాడు. నేను మా నాన్నగారి ఇంటికి తిరిగి వచ్చాను. నేను విడాకులకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.

Next Story