- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kamal Haasan: థగ్ లైఫ్ సినిమాను అడ్డుకోవద్దు.. కర్ణాటక హైకోర్టులో కమల్ పిటిషన్
హీరో కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ విడుదలకు ఆంక్షలు విధించొద్దని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కన్నడ భాషకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, నేషనల్ డెస్క్: హీరో కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ విడుదలకు ఆంక్షలు విధించొద్దని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కన్నడ భాషకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. మే 24న చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ (Thug Life ) ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్ ‘కన్నడ భాష తమిళంలోంచే పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో జూన్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమాను రాష్ట్రంలో విడుదలకు అనుమతించరాదంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతూ కమల్ కోర్టును ఆశ్రయించారు.
సినిమా విడుదలను అడ్డుకోకుండా చూడాలి
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, సినీ వ్యాపార సంస్థలు మూవీ విడుదలకు అడ్డులేకుండా చర్యలు తీసుకోవాలని కమల్ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), నగర పోలీస్ కమిషనర్ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), ప్రో-కన్నడ కార్యకర్తల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని సినిమా విడుదలపై ప్రభుత్వం నిషేధం విధించింది. మే 30న కమల్ హాసన్ 24 గంటల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ అల్టిమేటం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కమల్ హాసన్ మాత్రం ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. "నిజంగా తప్పు జరిగితే క్షమాపణ చెబుతాను.. కానీ అలాంటి తప్పు ఏమీ జరగలేదని నమ్ముతున్నానని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పమంటూ నన్ను బెదిరించడం ఇది కొత్త కాదు. నా జీవనశైలి ఇది అని దయచేసి దాన్ని మార్చాలని ఒత్తిడి చేయవద్దు" అని ఆయన స్పష్టం చేశారు.






