- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నరకం చూపిస్తా’.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
యుద్ధం ముగింపు విషయంలో హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) డెడ్‌లైన్ విధించారు.

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధం ముగింపు విషయంలో హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) డెడ్‌లైన్ విధించారు. ఆదివారం లోపు తాము సూచించిన శాంతి ఫార్ములాపై హమాస్ స్పందన తెలియజేయకపోతే.. ఆ తర్వాత హమాస్‌కు నరకం చూపిస్తానని మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్-గాజా సంక్షోభంపై భారత్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పేసింది. యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ట్రంప్ ప్రతిపాదన దీర్ఘకాలిక శాంతికి మార్గమని అన్నారు. ఫ్రాన్స్, ఇటలీ ప్రధానులు కూడా ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. హమాస్ మాత్రం తమవద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని, ట్రంప్ సూచించిన ప్రణాళికపై మాత్రం అధ్యయనం చేసి అభిప్రాయం వెల్లడిస్తామని చెబుతోంది.






