- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: భారత్‌కు మేం దూరమయ్యాం.. కుట్రబుద్ధి ఉన్న దేశానికి దగ్గరైంది : ట్రంప్ సంచలన పోస్ట్
భారత్ తో పాటు రష్యాకు కూడా దూరమయ్యామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన పోస్ట్ సెన్సేషన్ గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ పై వరుసగా పన్నులు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా భారత్ కు దూరమయ్యామంటూ ట్రూత్ సోషల్ (Truth Social)లో చేసిన పోస్ట్ సెన్సేషన్ గా మారింది. భారత్ తో పాటు రష్యాకు కూడా దూరమయ్యామంటూ ఆ పోస్టులో ట్రంప్ తన ఆవేదనను వెలిబుచ్చారు. వక్రబుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయని, ఈ మూడు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలాకాలం కొనసాగవచ్చంటూ ప్రధాని మోదీ, జిన్ పింగ్, పుతిన్ కలిసి చైనా వేదికగా జరిగిన ఎస్‌సీఓ సమావేశంలో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటో మూడు దేశాలు ఏకతాటిపై ఉన్నట్లుగా కనిపిస్తున్న క్రమంలో.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చైనాకు భారత్, రష్యా దగ్గరైనట్లుగా తమకు తెలుస్తోందని, ఆ ముగ్గురు నేతలకూ మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని ట్రంప్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. కాగా.. ఈ పోస్టుపై స్పందించేందుకు విదేశాంగ శాఖ నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల భారత్ పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తానూ సుంకాలను విధిస్తున్నానని, భారత్‌పై సుంకాలను పెంచడంలో తప్పులేదని పేర్కొనడం కొసమెరుపు. దీంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ మరింత పెరిగింది.






