- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: టెన్షన్ వద్దు.. ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.

Strait of Hormuz dispute Big shock for America
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత గతంలో కంటే కూడా తక్కువగా ధరలు ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్ పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉండగా ఇరాన్ పై దాడుల్లో సహకరించని స్పెయిన్ తో ట్రేడ్ రద్దు చేసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో యూకే పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్.
పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ సర్కార్ క్లారిటీ
యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఇండియాలో చమురు నిల్వలు 45 రోజులకు సరిపడా ఉన్నాయని వివరించారు.






