- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ - పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపా.. మరోసారి ప్రకటించుకున్న ట్రంప్
భారత్ - పాకిస్తాన్ యుద్ధం(India-Pakistan War)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్ యుద్ధం(India-Pakistan War)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి(United Nations)లో ట్రంప్ ప్రసంగించారు. భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని స్వయంగా మరోసారి ప్రకటించారు. తొమ్మిది నెలల్లో మొత్తం ఏడు యుద్ధాలు ఆపినట్లు ప్రకటించుకున్నారు. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే తాను ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నానని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే నా ప్రధాన లక్ష్యం.. అదే నాకు నోబెల్ బహుమతితో సమానం అని చెప్పారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలం అయింది. ఐరాస తన ప్రాముఖ్యతను కోల్పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రంప్ ప్రకటనను కేంద్రం అనేకసార్లు ఖండించింది. అయినా ఆయన తీరు మాత్రం మారట్లేదు. తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడటం, తానే స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






