- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండోసారి ట్రంప్ పాలనకు ఏడాది పూర్తి.. గ్రీన్ ల్యాండ్ అంశంపై హాట్ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. వైట్ హౌస్ ఆసక్తికర ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. వైట్ హౌస్ ఆసక్తికర ప్రకటన చేసింది. 365 రోజుల్లో 365 విజయాలు సాధించినట్లు పేర్కొంది. సరిహద్దుల రక్షణ, అమెరికన్ల బలాన్ని పునర్నిర్మించేందుకు, అమెరికన్లకు తొలి ప్రాధాన్యమిచ్చేందుకు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిందని తెలిపింది. ఏడాది కాలంలోనే ఏ దేశ అధ్యక్షుడికీ సాధ్యం కాని రీతిలో అద్భుతమైన ఫలితాలను సాధించారని చెప్పింది.
యూరప్ తో టారిఫ్ వివాదాలు - గ్రీన్ ల్యాండ్ అంశంపై హాట్ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ లో ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూరప్ తో టారిఫ్ వివాదాలు - గ్రీన్ ల్యాండ్ అంశాలపై ట్రంప్ హాట్ కామెట్స్ చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై కొత్తగా టారిఫ్‌లు విధించాలన్న ట్రంప్ నిర్ణయానికి యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ దీనిని “దీర్ఘకాల మిత్రదేశాల మధ్య పొరపాటు నిర్ణయం”గా అభివర్ణించారు. గతేడాది అదనపు టారిఫ్‌లు విధించబోమని ట్రంప్ ఇచ్చిన హామీపై ఇప్పుడు అనుమానం వ్యక్తం చేశారు.
మెక్రాన్ పదవిపై జోస్యం
ఫిబ్రవరి నుంచి డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచిన ఎనిమిది యూరోపియన్ దేశాలపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా అధీనంలోకి తీసుకోవాలన్న తన ప్రయత్నాలను ఆయన కొనసాగిస్తున్నారు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న గత వ్యాఖ్యలపై ప్రశ్నించగా ట్రంప్ సమాధానం దాటవేశారు. “దాని గురించి ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు” అని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి తాను హాజరు కాబోనని ట్రంప్ తెలిపారు. మెక్రాన్ ఎక్కువకాలం అధికారంలో ఉండడని ట్రంప్ జోస్యం చెప్పారు.
Read More..






