- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దావోస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈఓలకు ఆహ్వానం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆరేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దావోస్ (Davos)లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆరేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ స్పెషల్ డిన్నర్‌ను ఏర్పాటు చేయడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక విందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాటు, భారతదేశానికి చెందిన ఏడుగురు ప్రముఖ సీఈఓలకు (CEOs) ఆహ్వానం అందింది.
కాగా, ఈసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల వ్యాపారవేత్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఏడుగురు భారతీయ దిగ్గజాలకు ఈ విందులో చోటు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్పెషల్ డిన్నర్‌లో అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.






