Viral: ఆర్డర్ చేసిన 16 ఏళ్ల తర్వాత డెలివరీ.. విచిత్రమైన ఘటన వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-01-11 06:43:39  IST  )

కాలం ఎంత వేగంగా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన నోకియా 'మ్యూజిక్ ఎడిషన్' ఫోన్లు.. ఆర్డర్ ఇచ్చిన 16 సంవత్సరాల తర్వాత డెలివరీ అయ్యి వార్తల్లో నిలిచాయి.

Viral: ఆర్డర్ చేసిన 16 ఏళ్ల తర్వాత డెలివరీ.. విచిత్రమైన ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలం ఎంత వేగంగా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన నోకియా 'మ్యూజిక్ ఎడిషన్' ఫోన్లు.. ఆర్డర్ ఇచ్చిన 16 సంవత్సరాల తర్వాత డెలివరీ అయ్యి వార్తల్లో నిలిచాయి. లిబియా రాజధాని ట్రిపోలిలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

లిబియాకు చెందిన ఒక మొబైల్ డీలర్ 2010లో నోకియా ఫోన్ల కోసం భారీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, ఆ మరుసటి ఏడాది (2011)లో లిబియాలో తీవ్రమైన అంతర్యుద్ధం మొదలైంది. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల వల్ల లాజిస్టిక్స్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో సదరు ఫోన్ల షిప్‌మెంట్ కస్టమ్స్ వద్దే చిక్కుకుపోయింది. దీంతో కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ పార్శిల్‌కు ఏకంగా దశాబ్ద కాలానికి పైగా సమయం పట్టింది.

వార్తల్లో నిలిచిన పాత మోడల్స్

డెలివరీ అయిన బాక్సులను తెరిచిన డీలర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందులో అప్పట్లో ఎంతో పాపులర్ అయిన నోకియా మ్యూజిక్ ఎడిషన్ ఫోన్లు చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తున్నప్పటికీ, ఈ పాత ఫోన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వింటేజ్ ఫోన్లకు ఫుల్ డిమాండ్!

ప్రస్తుతం ఈ ఫోన్లు వినియోగానికి పనికొస్తాయా అన్నది పక్కన పెడితే.. 'వింటేజ్ కలెక్టర్ల' (పాత వస్తువులను సేకరించే వారు) వద్ద వీటికి భారీ డిమాండ్ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 16 ఏళ్ల క్రితం నాటి ఈ ఫోన్లు ఇప్పుడు 'అరుదైన వస్తువులుగా' మారి లక్షల ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story