- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ప్రధాని ద్వీప దేశమైన సైప్రస్ లో పర్యటిస్తున్నారు. మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని మోడీ సైప్రస్ కు ముందుగా వెళ్లారు. ఈ సందర్బంగా మోడీకి ఆ దేశం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి రెండు దశాబ్ధాల తర్వాత సైప్రస్ కు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండు దేశాలు మధ్య శాంతి భద్రతలు, సార్వభౌమాధికారంతో పాటు స్నేహబంధం పెంపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తుర్కియే ను అడ్డుకునేందుకు ఎత్తుగడ
లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. తుర్కియే దేశానికి సైప్రస్ కు మధ్య సంబంధాలు సరిగా లేవు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే పాకిస్థాన్ కు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసింది. ఈ సమయంలో తుర్కియేను నిలువరించడానికి ప్రధాని మోడీ వేసిన ఎత్తుగడే ఈ పర్యటన అని అనుకుంటున్నారు. ఈ పర్యటనలో సైప్రస్ తో విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రగతి, వాణిజ్య, వ్యాపార సంబంధాలతో పాటు సైప్రస్ కు అండగా నిలబడటమే కాకుండా తుర్కియే అవకాశాలను దెబ్బతీసేందుకు దోహదపడనుంది. సైప్రస్ పర్యటన అనంతరం కెనడా, క్రోయేషియా కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.






