సైబర్ లైంగిక నిందితుడు అరెస్టు.. వీడియోలు తీసి మహిళలకు వేధింపులు

by Shamantha N |   (  Updated:2025-06-18 09:25:16  IST  )

సోషల్ మీడియాలో మహిళల పేరు, ఫొటోతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసుకుని మహిళలు, అమ్మాయిలే లక్ష్యంగా అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్న నిందితుడిని ముంబయి పోలీసులు కర్ణాటకలో పట్టుకున్నారు.

సైబర్ లైంగిక నిందితుడు అరెస్టు.. వీడియోలు తీసి మహిళలకు వేధింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియాలో మహిళల పేరు, ఫొటోతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసుకుని మహిళలు, అమ్మాయిలే లక్ష్యంగా అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్న నిందితుడిని ముంబయి పోలీసులు కర్ణాటకలో పట్టుకున్నారు. రెండేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్ (25) ను కర్ణాటక రాష్ట్రం బాల్లారి జిల్లా సందూరు పట్టణంలో అరెస్ట్ చేశారు. శుభం కుమార్ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడిపై ముంబయిలో ఓ మహిళా విద్యార్థిని వేధించిన కేసులో ఫిర్యాదు నమోదు కాగా.. ఎట్టకేలకు 2 సంవత్సరాలకు పోలీసులకు చిక్కాడు.

10 నకిలీ ఫ్రొపైళ్లు.. 90 కి పైగా ఫేక్ ఈమెయిల్ ఐడీలు..

శుభం సోషల్ మీడియాలో మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వారి పరువు తీసే విధంగా వేధిస్తుంటాడు. ఇప్పటి వరకు 10కి పైగా నకిలీ ప్రొఫైల్స్, 90 కంటే ఎక్కువ ఫేక్ ఈమెయిల్ ఐడీలు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీడియో కాల్స్ ద్వారా మహిళలను టార్గెట్ చేసి, ఆ వీడియోలను మోడిఫై చేసి అసభ్యకరంగా షేర్ చేశాడని విచారణలో వెల్లడైంది. అతని మొబైల్‌ ఫోన్‌లో 13,500 మందికి పైగా మహిళల ఫోటోలు లభించాయి,. వీటిని అనుమతి లేకుండా సేకరించినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్‌ నుంచి టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకుని ముంబయి పోలీసులు, ప్రత్యేక బృందం ట్రేస్ చేసి సందూరు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో డిప్లొమా పూర్తి చేసిన ఈ నిందితుడు రెండు సంవత్సరాలుగా పోలీసుల కళ్లగప్పుతూ ఆన్‌లైన్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విచారణ పూర్తయితే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.

Next Story