- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > అల్లర్లకు, హింసకు ఆర్ఎస్ఎస్సే కారణం.. నిషేధించండి: మల్లికార్జున్ ఖర్గే
అల్లర్లకు, హింసకు ఆర్ఎస్ఎస్సే కారణం.. నిషేధించండి: మల్లికార్జున్ ఖర్గే
by Vemula.Srinu Prasad |
అల్లర్లకు, హింసకు ఆర్ఎస్ఎస్సే కారణమని ఆ సంస్థను నిషేధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో పలు చోట్ల అల్లర్లు, హింసలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్లకు, హింసకు ఆర్ఎస్ఎస్సే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అంతేకాదు Rssపై తక్షణమే నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు మోదీ తూట్లు పొడుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ వర్ధంతి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మహాత్మాగాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని సర్ధార్ పటేల్ 1948లో రాసిన లేఖను గుర్తు చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని కొనియాడారు. దేశ, ఐక్యత, సమగ్రత కోసం పటేల్, ఇందిరాగాంధీ కృషి చేశారని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.
Next Story






