- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే వచ్చి నన్ను చంపండి: ఉద్దవ్ ఠాక్రే
శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. షిండే వర్గం ఠాక్రే బ్రాండ్‌ను నాశనం చేయాలని కుట్రపన్నుతోందని ఆరోపించారు. తనను రాజకీయంగా అంతం చేయాలంటే వచ్చి చేసుకోండి అని సవాల్ విసిరారు. 1991లో వచ్చిన ‘ప్రహార్’ సినిమాలో నానా పటేకర్ చెప్పిన డైలాగ్ ను ఉద్ధవ్ ప్రస్తావించారు. నానా పటేకర్ గూండాల మధ్య నిలబడి ‘వచ్చి నన్ను చంపండి’ అంటాడు. నేను కూడా ఈ ద్రోహుల ముందు నిలబడి చెబుతున్నాను. ధైర్యం ఉంటే వచ్చి నన్ను చంపండి.. కానీ వచ్చేటప్పుడు అంబులెన్స్‌తో రండి ఎందుకంటే అది మీకే అవసరం పడుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరాఠా పార్టీలు ఏకమవకుండా బీజేపీ అడ్డుకుంటోందని హోటల్ మీటింగ్ లు ఆపాలని బీజేపీని హెచ్చరించారు. మీరు ఠాక్రే బ్రాండ్ ను నాశనం చేయాలని చూస్తే మేం మీ బీజేపీని నాశనం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తోడేళ్లు సింహాం తోలు వేసుకున్నంత మాత్రాన సింహాలు కాలేవు: ఏక్ నాథ్ షిండే
ఉద్ధవ్ వ్యాఖ్యలపై స్పందించిన షిండే వర్లీలో (Worli) లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ .. ఒకరు నన్ను చంపండి అని అంటున్నాడు. లండన్ వెకేషన్‌కి వెళ్లి వచ్చాక ఏదో ఇంగ్లీష్ సినిమా చూసి ఇంతలా ఫీలయ్యాడేమో అంటూ వ్యంగంగా స్పందించారు. ఇప్పటికే ప్రజలతో ఓటమి చవిచూసిన వాడిని మళ్లీ ఎందుకు ఏమీ చేయాలి అని ప్రశ్నించారు. అంతేకాదు ‘నన్ను చంపాలంటే అంబులెన్స్ తీసుకొని రా’ అంటున్నారు. గుర్తుంచుకోండి తోడేలు సింహపు చర్మం వేసుకుంటే అది సింహం కాలేదు అని షిండే ఉద్దవ్ ఠాక్రే పై విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటూ “బోల్ బచ్చన్ మాటలకు నేను స్పందించను. అలాంటి వాళ్ల గురించి చెప్పే అవసరం నాకు లేదు. అంటూ ఉద్ధవ్ వ్యాఖ్యలను తక్కువ చేసి మాట్లాడారు. కాగా 2022లో ఎక్ నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపారు. ఆ తర్వాత శివసేన విభజన జరిగింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిపి ఉన్న ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం బీజేపీ, షిండే మద్దతుతో అధికారంలోకి వచ్చింది.






