రైతు పొలంలో రూ.5000కోట్ల నోట్ల కట్టలు..

by Sujitha Rachapalli |

పేదరికంలో మగ్గుతున్నాం.. లంకె బిందె దొరికింది.. ఏం చేస్తాం.. చక్కగా తీసుకుని జీవితంలో ఎంతో కొంత ఎదగడానికి ప్రయత్నిస్తాం. ఓ బిజినెస్ పెట్టుకుని.. లైఫ్ సెట్ చేసుకుంటాం. కానీ ఈ రైతు మాత్రం అలా చేయలేదు. నిజాయితీతో తన

రైతు పొలంలో రూ.5000కోట్ల నోట్ల కట్టలు..
X

దిశ, వెబ్ డెస్క్: పేదరికంలో మగ్గుతున్నాం.. లంకె బిందె దొరికింది.. ఏం చేస్తాం.. చక్కగా తీసుకుని జీవితంలో ఎంతో కొంత ఎదగడానికి ప్రయత్నిస్తాం. ఓ బిజినెస్ పెట్టుకుని.. లైఫ్ సెట్ చేసుకుంటాం. కానీ ఈ రైతు మాత్రం అలా చేయలేదు. నిజాయితీతో తన పొలంలో దొరికిన సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

కొలంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతు పాబ్లో ఎస్కోబార్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాడు. 2015లో ఆయన చేసిన నిజాయితీ పని ఇందుకు కారణం. కాగా అప్పటి నుంచి ట్రెండ్ అవుతునే ఉన్నాడు. విషయం ఏంటంటే.. రైతు తన పొలంలో కట్టలకట్టల డబ్బును గుర్తించాడు. కవర్లలో చుట్టి.. భూమిలో పాతిపెట్టిన మనీ.. పొలం తవ్వుతుండగా కనుగొన్నాడు. దాదాపు రూ.5000కోట్ల డబ్బు ఉండగా.. దాచుకోకుండా.. ప్రభుత్వానికి అప్పగించాడు. దీంతో హెడ్ లైన్స్ టచ్ చేశాడు. కానీ ఆ డబ్బు ఎక్కడిది? అక్కడికి ఎలా వచ్చింది? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

LINK

Next Story