పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీఎం విజయ్ ఫైర్

by Ajay Maddhiboyina |

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జోసెఫ్ స్పందించారు. ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని మండిప‌డ్డారు. ఈ మేరకు త‌మిళ‌నాడు సీఎంఓ నుండి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీఎం విజయ్ ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జోసెఫ్ స్పందించారు. ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని మండిప‌డ్డారు. ఈ మేరకు త‌మిళ‌నాడు సీఎంఓ నుండి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అందులో.. కేంద్ర ప్ర‌భుత్వ రంగ చ‌మురు కంపెనీలు పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను ముఖ్యంగా పెట్రోల్ లీట‌ర్ రూ.3, డీజిల్ పై లీట‌రుకు రూ.3 చొప్పున పెంచ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర త‌గ్గిన‌ప్పుడు పెట్రోలియం కంపెనీలు దానికి అనుగుణంగా పెట్రోల్చ డీజిల్ ధరలను తగ్గించవని అన్నారు. పైగా ఆ కంపెనీలు కేవలం లాభాలు మాత్రమే తీసుకుంటాయని పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తరవాత పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం తప్పు అని అన్నారు. ఇదిలా ఉంటే ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌టంతో భారత్ లోనూ కేంద్రం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. గ‌డిచిన నాలుగేళ్ల‌లో కేంద్రం ఇంధ‌న ధ‌ర‌ల‌ను భారీగా పెంచ‌డం ఇదే మొద‌టిసారి. అంతేకాకుండా ప్ర‌ధాని మోడీ కీల‌క సూచ‌న‌లు చేశారు. పెట్రోల్, డీజిల్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని అన్నారు. దానికి ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడ‌కాన్ని పెంచాల‌ని తెలిపారు. వీలైనంత‌వ‌ర‌కు ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కూడా వినియోగించాల‌ని చెప్పారు.

Next Story