హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదానికి కారణం సిగరెట్ పీకనా? వైరల్ అవుతున్న వీడియో

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-09 15:54:14  IST  )

హాంకాంగ్ లో ఈ నెల 26వ తేదీన జరిగిన భారీ అగ్ని ప్రమాదంంలో 128 మంది మరణించిన విషయం తెలిసిందే.

హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదానికి కారణం సిగరెట్ పీకనా? వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: హాంకాంగ్ లో ఈ నెల 26వ తేదీన జరిగిన భారీ అగ్ని ప్రమాదంంలో 128 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం తర్వాత మిస్సైన వారి ఆచూకీ తెలియకపోవడంతో.. అపార్ట్మెంట్లలోనే చిక్కుకుని మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఇంతటి భారీ అగ్నిప్రమాదానికి కారణం ఒక చిన్న సిగరెట్ పీక కారణమని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియో ప్రకారం.. సిగరెట్ కాల్చుతున్న వ్యక్తి ఒక భవన నిర్మాణ ప్రాంతంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ప్రమాదానికి గురైన ఏడు భారీ భవంతుల్లో మరమ్మతులు జరుగుతున్నాయని అక్కడ ఏర్పాటు చేసిన భారీ వెదురు బొంగులతో పాటు కిటికీల కోసం వాడిన పాలిస్టెరెన్ మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమైనట్లు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో కార్మికుడు మరమ్మతులు చేసే ప్రదేశంలోనే పనిచేస్తున్నాడని, అతను కాల్చి పారేసినా సిగరెట్ పీక వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ.. హాంకాంగ్ అధికారులు, పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు.

Click For Twitter Post ....

Next Story