భారత్‌, చైనాల మైత్రీ కాపాడుకోవాలి.. చైనా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

భారత్‌, చైనాలు సత్సంబంధాలు, మైత్రీని కాపాడుకోవాలని చైనా చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త, విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు.

భారత్‌, చైనాల మైత్రీ కాపాడుకోవాలి.. చైనా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌, చైనాలు సత్సంబంధాలు, మైత్రీని కాపాడుకోవాలని చైనా చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త, విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, అలాగే ఇరు దేశాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ఆదివారం బీజింగ్‌లో జరిగిన వార్షిక రాజకీయ సమావేశాల ('టూ సెషన్స్') సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, చైనా దేశాలు పత్యర్థుల్లా కాకుండా కలిసి ఉండాలని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరికొకరు ముప్పు అని భావించకుండా, అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని వెల్లడించారు. 2024 నుంచే కజాన్ వేదికగా మోడీ, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని వివరించారు.

బలమున్న వాడిదే రాజ్యమంటే కుదరదు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై స్పందించారు. ‘పిడికిలి బలంగా ఉన్నంత మాత్రాన అది న్యాయం అనిపించుకోదు.. ప్రపంచం మళ్లీ అడవి చట్టం (Law of the Jungle) వైపు వెళ్లకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల మొదలైన ఈ యుద్ధం అసలు జరిగి ఉండకూడదని వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి దారి తీసిన పరిణామాలను చైనా ఇదివరకే తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా తన మొండి వైఖరిని వీడి, బీజింగ్‌తో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ట్రంప్ రాకతో పెరిగిన ఉద్రిక్తతలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని వాంగ్ యీ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం, పరస్పరం సుంకాల విధింపు వంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచాయని విమర్శించారు. ‘ఈ ఏడాది చైనా-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకం. ఇరు దేశాలు పరస్పర విభేదాలను పక్కనపెట్టి, సరైన వాతావరణంలో సంబంధాలను మెరుగు పరుచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

Next Story