Visa Pause: మా విద్యార్థులే టార్గెట్.. అమెరికాలో విద్యార్థి వీసా నిలిపివేతపై స్పందించిన చైనా

by Ramesh Naini |

ఇమ్మిగ్రేషన్ రూల్స్‌‌ను కఠిన తరం చేస్తున్న అమెరికా.. విదేశీ విద్యార్థుల విషయంలోనూ అక్కడి ప్రభత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Visa Pause: మా విద్యార్థులే టార్గెట్.. అమెరికాలో విద్యార్థి వీసా నిలిపివేతపై స్పందించిన చైనా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇమ్మిగ్రేషన్ రూల్స్‌‌ను కఠిన తరం చేస్తున్న అమెరికా.. విదేశీ విద్యార్థుల విషయంలోనూ అక్కడి ప్రభత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. (America) యూఎస్‌లోని విద్యా సంస్థల్లో విద్యనభ్యసించే భారత్ (Foreign students) సహా విదేశీ విద్యార్థులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్స్ (visa) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేసింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై చైనా స్పందించింది. అంతర్జాతీయ విద్యార్థుల హక్కులను కాపాడాలని చైనా అమెరికాను కోరింది. విద్యాపరమైన విషయాల్లో ఎలాంటి అడ్డంకులు కలిగించకూడదని తెలిపింది.

పరిశోధనా రంగాల్లో చదువుకుంటున్న వారితో పాటు, (Chinese Communist Party) చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్ధులను టార్గెట్ చేసినట్లు చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోవింగ్ మాట్లాడారు. తమ దేశ విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న కొంత మంది చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్దమవుతోందని యూస్ సెనేటర్ మార్కో రూబియో ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

యూఎస్‌లో చదివే విద్యార్థులు కళాశాల నుంచి తప్పుకున్నా, తరగతులకు హాజరు కాకపోయినా, సదరు విద్యా సంస్థకు తెలియజేయకుండా కోర్సును ఆపేసినా స్టూడెంట్ వీసా రద్దు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులోనూ మీకు అమెరికా వీసా కూడా మంజూరు చేయబడదు. ఎల్లప్పుడూ వీసా రూల్స్ పాటించాలి. ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి. విద్యార్థుల వీసా విషయంలో వారి సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా (Social media vetting) ప్రొఫైళ్లు పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్ తాత్కాలికంగా ఆమెరికా నిలిపివేసింది.

Next Story