ఉక్రెయిన్ యుద్ధానికి చైనా, భారత్ లే కారణం: డొనాల్డ్ ట్రంప్

by Malleboina Mahesh |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (UNGA) మాట్లాడుతూ

ఉక్రెయిన్ యుద్ధానికి చైనా, భారత్ లే కారణం: డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (80th United Nations General Assembly)లో (UNGA) మాట్లాడుతూ.. చైనా, భారతదేశాలను రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి (Russia-Ukraine war) "ప్రధాన ఆర్థిక వనరులు"గా పేర్కొన్నాడు. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా ఈ రెండు దేశాలు యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు. ఒక గంటకు పైగా సాగిన ట్రంప్ ప్రసంగం (Trump's speech)లో ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక అంతర్జాతీయ సమస్యలను ప్రస్తావించాడు. అంతకు ముందు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి కోసం కృషి జరుగుతున్నా.. అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

యుద్ధాలు, ఘర్షణలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి (United Nations) ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోతుందనే అభిప్రాయం బలపడుతుందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇలా వేదిక ఏదైనా ట్రంప్ మాత్రం తనను తాను గొప్పగా కీర్తించుకుంటు.. ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ప్రవర్తన మొత్తం అమెరికా స్వలాభం, డాలర్ విలువ పెంచేందుకే అని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

Next Story