- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలెబ్రిటీ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో కన్నుమూత
అమెరికన్ సెలెబ్రిటీ న్యాయమూర్తి, సోషల్ మీడియా స్టార్ ఫ్రాంక్ కాప్రియో (88) (Frank Caprio) కన్నుమూసినట్లు ఆయన కుటుంబం తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికన్ సెలెబ్రిటీ న్యాయమూర్తి, సోషల్ మీడియా స్టార్ ఫ్రాంక్ కాప్రియో (88) (Frank Caprio) కన్నుమూసినట్లు ఆయన కుటుంబం తెలిపింది. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 21న తుదిశ్వాస విడిచినట్లు ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కుటుంబసభ్యులు ప్రకటించారు. కాప్రియో కాట్ ఇన్ ప్రోవిడెన్స్ (Caught in Providence) అనే టీవీ షోలో సామాన్య ప్రజల సమస్యల పట్ల సానుభూతి చూపిస్తూ తీర్పులు చెప్పే ఆయన తీరు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జి అనే బిరుదును పొందారు.
ఈ షో సమయంలో చిన్నపిల్లలను తన పక్కన కూర్చోబెట్టి విచారణ చేయడం, తనపై ఆధారపడి తయారైన మినీ-జడ్జి బొమ్మను విడుదల చేయడం వంటి అనేక సందర్భాలు ఆయన మానవత్వాన్ని చూపించాయి. ఆయన న్యాయశైలికి సంబంధించిన వీడియోలు బిలియన్ల కొద్దీ వీక్షణలు పొందాయి. ఆయన సున్నితమైన మనసు, ప్రజల పట్ల చూపిన నమ్మకం, హాస్యం ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయనకు భార్య జాయ్స్ కాప్రియో, ఐదుగురు పిల్లలు, ఏడుగురు మనుమలు, ఇద్దరు మునిపిల్లలు ఉన్నారు.






