థాయ్‌లాండ్ - కాంబోడియా మధ్య సీజ్‌ఫైర్

by Muthe.Rajitha |

థాయ్‌లాండ్ - కాంబోడియా(Thailand - Cambodia) మధ్య జరుగుతున్న యుద్ధానికి తెర పడింది.

థాయ్‌లాండ్ - కాంబోడియా మధ్య సీజ్‌ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్ - కాంబోడియా(Thailand - Cambodia) మధ్య జరుగుతున్న యుద్ధానికి తెర పడింది. యుద్ధం మొదలైన 5 రోజుల తర్వాత ఇరు దేశాలు సీజ్‌ఫైర్(Ceasefire) కు అంగీరించాయి. ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణ చేయాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. థాయ్‌లాండ్ - కాంబోడియా సరిహద్దుల్లోని ఖ్మెర్-హిందూ ఆలయం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా జులై 24న ప్రారంభం అయిన సైనిక దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలలో కనీసం 35 మంది (సైనికులు, సామాన్య పౌరులతో సహా) మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 2,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ASEAN అధ్యక్షుడిగా, సీజ్‌ఫైర్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని UNO ప్రతిపాదించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరు దేశాల నాయకులతో మాట్లాడి కాల్పుల విరమణ చేయాలని కోరారు. దీంతో కాంబోడియా ప్రధాని హున్ మనెట్, థాయ్‌లాండ్ యాక్టింగ్ ప్రధాని ఫుమ్తామ్ వీచయాచై మలేసియాలోని పుత్రజయలో నేడు చర్చలు జరపడానికి అంగీకరించారు. ఈ చర్చలు సఫలం అయ్యి నిబంధనలు లేని తక్షణ సీజ్‌ఫైర్ అమలులోకి వచ్చినట్లు కాంబోడియా, థాయ్‌లాండ్, మలేసియా నాయకులు ఓ ప్రకటన జారీ చేసారు.

Next Story