- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఆ ఫొటోలు హృదయాన్ని కలిచివేశాయి: ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని ట్రూడో దిగ్భ్రాంతి
ఆ ఫొటోలు హృదయాన్ని కలిచివేశాయి: ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని ట్రూడో దిగ్భ్రాంతి
ఒడిషా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిషా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశంలోని ఒడిశాలో రైలు ప్రమాదం యొక్క చిత్రాలు మరియు నివేదికలు నా హృదయాన్ని కలిచివేశాయి. ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు భారతదేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారు’’ అని మృతులకు కుటుంబాలకు సంతాపం తెలిపారు. రైలు ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోవడం.. మరో 900 మంది గాయపడటం తీవ్ర విచారకరమన్నారు. ఇక, శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 280 మంది వరకు మరణించగా.. మరో 900 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Next Story






