- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్.. రూ. 921 కోట్ల స్కాలర్‌షిప్ నిధి ప్రకటన
భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 921 కోట్లు) భారీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్-కెనడా మధ్య విద్యా సంబంధాలను పునరుద్ధరించే దిశగా కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 921 కోట్లు) భారీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం మార్చి 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
200 మందికి పూర్తి ఉచిత విద్య..
ఈ భారీ నిధితో సుమారు 200 మంది ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు కెనడాలోని అగ్రశ్రేణి వర్సిటీల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర నిత్యావసర ఖర్చులను కూడా ఈ స్కాలర్‌షిప్ కింద భరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ చొరవలో టొరంటో విశ్వవిద్యాలయం (University of Toronto) కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, త్వరలోనే ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు గడువు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికార వర్గాల సమచారం. కెనడాలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు.
13 కీలక ఒప్పందాలు (MoUs)
కేవలం స్కాలర్‌షిప్‌లే కాకుండా, ఇరు దేశాల విద్యా సంస్థల మధ్య సమన్వయం కోసం 13 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. కెనడా నుంచి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, సైమన్ ఫ్రేజర్, డల్హౌసీ వర్సిటీలు.. భారత్ నుంచి ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, SRM ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ఒప్పందాల్లో భాగమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లీన్ ఎనర్జీ, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉమ్మడి పరిశోధనలకు ఈ ఒప్పందాలు దారితీస్తాయి.






