దేవుడితో వ్యాపార‌మా? కూల్ డ్రింక్ కంపెనీపై నెటిజ‌న్ల ఫైర్

by Ajay Maddhiboyina |

కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్ ప్ర‌మోష‌న్ కోసం ఏమైనా చేస్తాయి. అయితే అలా చేసే స‌మయంలో వినూత్నంగా ఆలోచించి చిక్కుల్లో ప‌డుతుంటాయి.

దేవుడితో వ్యాపార‌మా? కూల్ డ్రింక్ కంపెనీపై నెటిజ‌న్ల ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్ ప్ర‌మోష‌న్ కోసం ఏమైనా చేస్తాయి. అయితే అలా చేసే స‌మయంలో వినూత్నంగా ఆలోచించి చిక్కుల్లో ప‌డుతుంటాయి. తాజాగా అలాంటి వివాదంలోనే ప్ర‌ముఖ కూల్ డ్రింక్ కంపెనీ కాంపా కూడా నిలిచింది. కాంపా కూల్ డ్రింక్ యాడ్ పై పూరీజగన్నాథ్ ఆలయం ఫోటోను ముద్రించారు. దీంతో ఆ కంపెనీ తీరు వివాదాస్పదంగా మారింది. ఆ కంపెనీ కూల్ డ్రింక్స్ బైకాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో బైకాట్ కాంప దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండింగ్ మారింది. హిందూ సంఘాలు సైతం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని కూల్ డ్రింగ్ కంపెనీ యాడ్ పై వాడుకోవడంతో మండిపడుతున్నాయి. ఇక ఈ కూల్ డ్రింక్ కంపెనీ మరెవరిదో కాదు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ముకేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందినదే. దీంతో వెంటనే ఆ యాడ్స్ తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవుళ్లకు సంబంధించిన ఆలయాలు, దేవుడి చిత్రాలనే యాడ్స్‌లో ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం పై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story