- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి పాలతో ఐస్ క్రీం...ధర ఎంతంటే ?
తల్లిపాలు (Mother Milk) ఎంతో శ్రేష్టమైనవి. తల్లిపాలు తాగితే... పిల్లలు ( Kids) ఎంతో బలంగా తయారవుతారు. అయితే ఈ మధ్యకాలంలో

దిశ, వెబ్ డెస్క్: తల్లిపాలు (Mother Milk) ఎంతో శ్రేష్టమైనవి. తల్లిపాలు తాగితే... పిల్లలు ( Kids) ఎంతో బలంగా తయారవుతారు. అయితే ఈ మధ్యకాలంలో.. చాలా మంది తల్లులకు.. పాలు రాకపోవడంతో డబ్బా పాలు వాడుతున్నారు. రకరకాల కారణాల వల్ల తల్లి పాలు.. మహిళలకు రావడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... తల్లిపాల ఫ్లేవర్ ఉండేలా మార్కెట్లోకి కొత్త ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఈ మేరకు అమెరికాలోని ( America ) ఓ ప్రముఖ బేబీ బ్రాండ్ కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ ( breast milk-flavored ice cream) తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది సదర్ కంపెనీ. తల్లి పాలతో తయారుచేసిన... ఐస్ క్రీమ్ ను తీసుకువస్తామని తెలిపింది. అయితే ఈ ఐస్ క్రీమ్ లో తల్లిపాలు కలవడం.. సాధ్యం కాని పని. అచ్చం తల్లిపాల ఫ్లేవర్ ఉండేలా.. ఈ ఐస్ క్రీమ్ తీసుకురాబోతున్నారట. త్వరలోనే దీని ధర కూడా ప్రకటించనున్నట్లు సదర్ కంపెనీ వెల్లడించింది.
బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ తో లాభాలు
ఈ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్... తినడం వల్ల.. శరీరానికి చాలా రకాల విటమిన్లు అందుతాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, కాల్షియం, విటమిన్ బి అలాగే విటమిన్ డి పుష్కలంగా శరీరానికి లభిస్తాయని చెబుతున్నారు. జింక్ శాతం కూడా శరీరానికి లభిస్తుందని వెల్లడిస్తున్నారు. శరీరానికి కావాల్సిన కొవ్వులు కూడా అందుతాయని చెబుతున్నారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ ఐస్ క్రీమ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.






