Nepal earthquake: భారీ భూకంపం.. 69 మంది మృతి

by Disha Web Desk 4 |
Nepal earthquake: భారీ భూకంపం.. 69 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం 69 మందిని బలికొంది. శుక్రవారం రాత్రి ఈ భూకంపం సంభవించగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాజర్ కోట్ జిల్లా లామిడందా ఏరియాలో ఈ భూకంపం సంభవించింది. జాజర్ కోట్ జిల్లాలో 34 మంది, పక్కనే ఉన్న రుకుమ్ వెస్ట్ జిల్లాలో 35 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఆఫీస్ ఈ ఘటనపై స్పందించింది. మూడు సెక్యూరిటీ ఏజెన్సీలను యుద్ధప్రాతిపాదికన రెస్క్యూ ఆపరేషన్‌లకు పంపినట్లు తెలిపింది.

దైలెక్, సల్యాన్, రోల్పా జిల్లాల నుంచి కూడా పలువురు గాయాపడినట్లు, ఆస్తులు ధ్వంసం అయినట్లు రిపోర్టులు అందుతున్నాయని హోం మినిస్ట్రీ కార్యాలయం పేర్కొంది. ఈ భూకంపంలో గాయపడిన వారిని జాజర్ కోట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాఠ్మాండు నుంచి జాజర్ కోట్ 500 కిలో మీటర్లు ఉంటుంది. హిమాలయ పర్వతాలు ఉన్న నేపాల్ లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. అక్టోబర్ 3న 6.2 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో భూమి కంపించింది.


Next Story

Most Viewed