ఏపీలో భారీగా నామినేషన్ల ఆమోదం.. స్పల్పంగా తిరస్కరణ

by Disha Web Desk 16 |
ఏపీలో భారీగా నామినేషన్ల ఆమోదం.. స్పల్పంగా తిరస్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అధికారులు నామినేషన్లు పరిశీలించారు. 25 ఎంపీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.. సరైన పత్రాలు లేకపోవడంతో పలువురి నామినేషన్లు తిరస్కరించారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఎంపీ స్థానాలకు 686 నామినేషన్లు రాగా 503 ఆమోదించారు. 183 తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు ఎంపీ స్థానానికి 47 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 16 నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3664 నామినేషన్లు వేయగా 2705కి ఆమోదం తెలిపారు. 939 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు దాఖలు చేయగా అత్యల్పంగా చోడవరంలో 8 నామినేషన్లు దాఖలు చేశారు.



Next Story

Most Viewed