అధికారంలోకి రాగానే రామమందిరాన్ని శుద్ధి చేయిస్తాం.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Dishanational6 |
అధికారంలోకి రాగానే రామమందిరాన్ని శుద్ధి చేయిస్తాం.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే నలుగురు శంకరాచార్యలచే రామమందిరాన్ని శుద్ధి చేయిస్తామని చెప్పారు.

శంకరాచార్యుల సలహాకు విరుద్ధంగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని గుర్తు చేశారు. దాన్ని సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రధాని మోడీ పూజలు చేశారని అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ ఏర్పాటు చేస్తామని నానాపటోలే అన్నారు. నలుగురు శంకరాచార్యులు సరైన ఆచారాలు పాటించలేదని చెప్పారని అన్నారు.

నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు.‘సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ద్వారా రాముడి ఉనికిని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసిందని మహా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామసేతును సవాల్ చేశారని గుర్తుచేశఆరు. రాముడు నిజమా కాదా.? అని ప్రశ్నలు అడిగేవారుని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ కావాలనే దారి మళ్లించిందని పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.

కాబట్టి రామమందిర నిర్మాణం క్రెడిట్ ఎవరికైనా వెళితే, అది ప్రధాని మోడీకి చెందుతుందని అన్నారు ఫడ్నవీస్. అయోధ్య నిర్మించేందుకు 495 ఏళ్లుగా ప్రయత్నించిన ప్రజలందరికీ మోడీ నివాళులు అర్పించారని తెలిపారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని.. పైపెచ్చు.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలను తిరస్కరించిందని గుర్తుచేశారు. అలాంటి వారికి ఈ విషయం చెప్పే హక్కులేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed