Bloodshed in Gaza: గాజాలో రక్తపాతం.. ఇజ్రాయెల్ దాడుల్లో 26 మంది మృతి

by Shamantha N |

గాజాలోని రఫా ప్రాంతంలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకుంది. అమెరికా మద్దతుతో నడుస్తున్న సహాయక కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 26 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా.. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అల్-ఆలమ్ రౌండబౌట్ వద్ద జరిగింది.

Bloodshed in Gaza: గాజాలో రక్తపాతం.. ఇజ్రాయెల్ దాడుల్లో 26 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా ప్రాంతంలో ఆదివారం ఘోర ఘటన చోటు చేసుకుంది. అమెరికా మద్దతుతో నడుస్తున్న సహాయక కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 26 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా.. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అల్-ఆలమ్ రౌండబౌట్ వద్ద సంభవించింది. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు సహాయం కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం ఆకస్మికంగా కాల్పులకు పాల్పడిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రికి తరలించారు. సహాయక కేంద్రంగా పని చేస్తున్న గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. ఇది ఒక ‘కొత్త హత్యాకాండ గా అభివర్ణించింది. ‘ఇవి మానవతా కేంద్రాలు కాదు మరణపు పాశాలు‘ అని హమాస్ తీవ్రంగా మండిపడింది. సహాయ కేంద్రాల పేరుతో నిరాశ్రయుల ప్రాణాలను ఇజ్రాయిల్ తీస్తోందని విమర్శలు చేసింది.

ఇజ్రాయిల్ తీరుపై సర్వత్రా విమర్శలు

గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలను మరింత ప్రమాదంలోకి ఇజ్రాయిల్ నెడుతోందని విమర్శించింది. ఇప్పటికే గాజాలో ఆకలితో అలమటిస్తూ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో ఏకంగా 54, 381 పాలస్తీనా వాసులు చనిపోయారు. వీరిలో చాలా మంది సాధారణ పౌరులే. అక్టోబర్ 7న జరిగిన హమాస్ (hamas) దాడిలో 1,218 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం గాజాలో 57 మంది బందీలుగా ఉన్నారు. వారిలో 34 మంది మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

Next Story