- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Breaking News : కస్టమర్లకు భారీ షాక్... బంగారం అమ్మకాలు నిలిపివేత
మహిళలకు బంగారు నగలంటే(Gold Jewelry) ఎంతో మక్కువ.

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు బంగారు నగలంటే(Gold Jewelry) ఎంతో మక్కువ. ఏదైనా శుభకార్యం జరిగినా.. పండగ వచ్చినా మొదట కొనేది బంగారమే. ఇక పెళ్ళిళ్ళ సీజన్ వస్తే బంగారం కొనే వాళ్ళతో నగల షాపులన్నీ కిటకిటలాడుతాయి. బంగారం ధర(Gold Prices) చుక్కలను తాకినా సరే కొనుగోళ్లు మాత్రం ఏ మాత్రం తగ్గవు. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నవేళ.. ఓ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో సౌత్ కొరియా(South Korea) బంగారం బిస్కెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ(Suspension of Gold Bar Sales) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 11న గోల్డ్ బార్ అమ్మకాలు ఆపివేస్తున్నట్టు మింటింగ్ కార్పొరేషన్ గోల్డ్ బార్స్ అసోసియేషన్ అన్ని కమర్షియల్ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. దాని ముడిసరుకు సేకరించడం కష్టంగా మారిందని, అందువల్ల బంగారం బిస్కెట్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మళ్ళీ ఎప్పుడు అమ్మకాలు మొదలు పెడతామో ఇప్పుడే చెప్పలేమని, అంతదాకా ఎదురు చూడాలని వెల్లడించింది. ఇక మనదేశంలో కూడా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 87 వేలుగా ఉంది.






