- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jeff Bezos : ప్రపంచ కుబేరుడి పెళ్ళికి నిరసనల సెగ
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos), జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్(Lauren Sanchez) ల పెళ్ళికి అందాల నగరం వెనిస్(Venic) లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos), జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్(Lauren Sanchez) ల పెళ్ళికి అందాల నగరం వెనిస్(Venic) లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఎంతో ఆడంబరంగా జరగనున్న ఈ వేడుకలకు వెనిస్ మొత్తం అదిరిపోయేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో స్థానికుల నుంచి బెజోస్ పెళ్ళిపై తీవ్ర నిరసనలు వెల్లువెతున్నాయి. భారీ సంపన్నుల వేడుకలకు అధిక పన్నులు వసూలు చేయాలని డిమాండ్ తో అక్కడి ప్రజలు ఆందోళనలు చేపట్టగా.. ప్రస్తుతం అవికాస్త తీవ్ర రూపం దాల్చినట్టు తెలుస్తోంది.
దీంతో బెజోస్ వివాహ వేదికను మరో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. నగరంలో పలుచోట్ల 'నో స్పేస్ ఫర్ బెజోస్'(No Space for Bezos) స్థానికులు చేపట్టిన ఆందోళనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెనిస్ మేయర్ మాత్రం ఈ సెలెబ్రెటీ వివాహానికి మద్ధతు పలికారు. ఈ వేదిక ద్వారా స్థానికంగా ఎంతో వ్యాపారం జరుగుతుందని, ఎంతోమందికి లాభం చేకూరుతుందని చెబుతున్నారు.






