- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయిల్ విద్యుత్ ప్లాంట్లపై ఇరాన్ దాడులు
ఇరాన్, ఇజ్రాయిల్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు తెగబడింది. దాదాపు 40 నిమిషాల పాటు చేసిన దాడులతో ఇజ్రాయిల్ లోని విద్యుత్ కేంద్రాలు చాలా మేరకు దెబ్బతిన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయిల్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు తెగబడింది. దాదాపు 40 నిమిషాల పాటు చేసిన దాడులతో ఇజ్రాయిల్ లోని విద్యుత్ కేంద్రాలు చాలా మేరకు దెబ్బతిన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. దెబ్బతిన్న విద్యుత్ కేంద్రాల నుంచి కరెంట్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ఎలక్రికల్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. ఇజ్రాయిల్ పై ఇరాన్ 15 బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడిందని ఈ దాడుల్లో కీలకమైన విద్యుత్ ప్లాంట్లు దెబ్బతిన్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొన్నట్లు తెలిపింది.
ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడులు
ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాల్లో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 15 ఫైటర్ జెట్లతో ఇరాన్ లోని 6 ప్రాంతాల్లో 15 బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను ధ్వంసం ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయిల్ లోని ప్రముఖ విద్యుత్ ప్లాంట్లపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయిల్ లోని చాలా ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.






