గ్యాస్ సంక్షోభం.. భారత్‌ను ఆదుకుంటున్న అర్జెంటీనా

by velandi.Saikiran |

2026 మొదటి మూడు నెలల్లోనే దాదాపు 50 వేల టన్నుల గ్యాస్ ను ఇండియాకు పంపించింది అర్జెంటీనా.

గ్యాస్ సంక్షోభం.. భారత్‌ను ఆదుకుంటున్న అర్జెంటీనా
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇండియాలో LPG కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు మూత పడిపోతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఇండియాకు అండగా నిలిచింది అర్జెంటీనా. యుద్ధం కారణంగా ఏర్పడిన LPG కొరతను తీర్చడానికి ముందుకు వచ్చింది.

2026 మొదటి మూడు నెలల్లోనే దాదాపు 50 వేల టన్నుల గ్యాస్ ను ఇండియాకు పంపించింది. ఇది గత సంవత్సరం మొత్తం ఎగుమతుల కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. సుమారు 20,000 కిలో మీటర్ల సుదూర ప్రయాణం, రవాణా ఖర్చులు భారమైనప్పటికీ ఇండియా ఇంధన అవసరాల కోసం అర్జెంటీనా తన సహకారాన్ని మరింత పెంచేసింది. కష్ట సమయంలో ఆదుకుంది.

Next Story